రాష్ట్రంలో పిచ్చిపాలన: చినరాజప్ప

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 22, 2020, 02:32 PM
 

రాష్ట్రంలో పిచ్చిపాలన సాగిస్తున్నారని టీడీపీ నేత, మాజీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని అణగ తొక్కాలని చూస్తున్నారన్నారు. నా నియోజకవర్గంలో రూ.8కోట్ల నిధులతో రోడ్లు వేస్తే వాటిని పగలగొట్టి కక్ష తీర్చుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో నాటుసారా సమస్య పెరిగిపోయిందన్నారు. ఎప్పుడు రేషన్‌ కార్డు రద్దవుతుందో, ఎప్పుడు పింఛన్‌ రద్దవుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. చంద్రబాబుపై పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాలనపై సిట్‌ వేశారని, అధికారులనూ భయపెడుతున్నారన్నారు. బలమైన నాయకులపై కక్ష సాధింపులకు దిగుతున్నారన్నారు. ఇళ్లు ఇప్పిస్తామంటూ పేదల భూములు లాక్కుంటున్నారన్నారు. ఇసుకను దోచుకుంటున్నారన్నారు.