సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ నేత

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 22, 2020, 02:11 PM
 

టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ రస్ ఆల్ ఖైమా కేసు నుంచి దృష్టి మారల్చేందుకే సిట్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. రస్ ఆల్ ఖైమాకు రూ. 800 కోట్లు చెల్లించేందుకు సీఎం జగన్ తన ఎంపీలను ఆ దేశం పంపారన్నారు. రస్ ఆల్ ఖైమా విషయంలో వైసీపీ నేతలు ఎందుకు కిక్కురుమనడం లేదని ప్రశ్నించారు. జగన్‌ను నేరస్థుల ఒప్పందంలో భాగంగా ఆ దేశానికి జగన్‌ను అప్పగించే పరిస్థితి ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వైజాగ్‌లో ఇప్పుడు సచివాలయం ఎక్కడ పెడతారు!?.. 5 లక్షల ఎస్ఎఫ్‌టీ స్థలం ఎక్కడ ఉందని బోండా ఉమా ప్రశ్నించారు.