చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 22, 2020, 12:57 PM
 

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. మద్యం ధరలను పెంచి మందుబాబుల పొట్ట కొడుతున్నారంటూ రంకెలేస్తున్నారని మండిపడ్డారు. పీపీఏలను సమీక్షించి తక్కువ ధరకే కరెంట్ కొనుగోలు చేద్దామని ప్రభుత్వం భావిస్తుంటే అడ్డుపడతారని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పైనా దర్యాప్తు చేయవద్దంటారని దుయ్యబట్టారు. తన మాజీ పీఎస్ ఐటీ అధికారులకు అడ్డంగా దొరికితే కక్ష సాధింపు అంటారని విమర్శించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఏమైందని ప్రశ్నించారు.