గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 22, 2020, 11:17 AM
 

గుంటూరు  : జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. రేపల్లె మండలం నడింపల్లిలో రమాదేవి అనే మహిళపై సైనికోద్యోగి కాల్పులు జరిపాడు. రమాదేవి కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ బాలాజీ వెంటపడుతున్నాడు. రమాదేవి ఒప్పుకోకపోవడంతో  ఇవాళ తెల్లవారుజామున ఇంటికి వచ్చి కాల్పులు జరిపాడు. తుపాకీ చూసి అప్రమత్తమై రమాదేవి పక్కుకు తప్పుకునే క్రమంలో కుడి చెవి మీదుగా తూటా దూసుకెళ్లింది. నిందితుడు బాలాజీ పరారీలో ఉండగా.. అతడికి సహకరించిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.