ఐటీ దాడుల వ్యవహారంపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 14, 2020, 07:28 PM
 

ఆంధ్రప్రదేశ్ లో ఐటీ దాడుల వ్యవహారంపై వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు అవినీతిపరుడని మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని అన్నారు. ఇన్నాళ్లకు చంద్రబాబు పాపం పండిందని, అవినీతి భాగోతం అంతా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోందని విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబు రెండెకరాల నుంచి రూ.2 లక్షల కోట్లకు ఎదిగాడని ఆరోపించారు. రాష్ట్ర సంపదను దోపిడీ చేసి, ప్రజలపై అప్పులభారం మోపాడని వ్యాఖ్యానించారు.
నేటి పంచాంగం నేటి పంచాంగం

Wed, Feb 26, 2020, 03:27 PM