రేపు రాజధాని గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 14, 2020, 07:04 PM
 

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రేపు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు మంగళగిరి జనసేన ఆఫీసు నుంచి పవన్‌కల్యాణ్ బయల్దేరనున్నారు. ఎర్రబాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరు, అనంతవరం గ్రామాల్లో పవన్ కళ్యాణ్‌ పర్యటించనున్నారు. అసెంబ్లీ ముట్టడి భాగంగా లాఠీచార్జ్‌లో గాయపడినవారిని జనసేనాని పరామర్శించనున్నారు.