విశాఖలో నకిలీ ఐఏఎస్ అరెస్ట్ చేశారు. భూమి సమస్య పరిష్కరిస్తానంటూ ఓ వ్యక్తికి వల వేశాడు. నకిలీ ఐఏఎస్ అధికారి వ్యక్తి నుంచి రూ. 2.5 లక్షలు తీసుకున్నాడు. బాధితునికి అనుమానం రావడంతో పోలీసులకు పిర్యాదు చేశాడు. బాధితుని పిర్యాదు మేరకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఐఏఎస్ అనిల్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.