ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షేమ పథకాలను రద్దు చేశారు : చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2020, 03:48 PM

విజయవాడ  : టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం. సంక్షేమ పథకాలను రద్దు చేశారు. పోలవరం, అమరావతిని ఆపేశారు. నాలుగైదు రెట్లు ఇసుక ధర పెంచేశారు. 56 రోజులుగా అమరావతిపై ఆందోళనలు జరుగుతున్నాయి.40 మంది రాజధాని రైతులు గుండె ఆగి చనిపోయారు. 80 శాతం మంది మూడు రాజధానులు వద్దని చెప్పారు. ఇంట్లో నుంచి బయటకు రాని మహిళలు ఇవాళ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది.పోలీసులు అసభ్యంగా ప్రవర్తించినా మహిళలు వీరోచితంగా పోరాడారు. అమరావతిపై ఎన్ని అపవాదులు వేయాలో అన్నీ వేశారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారు.


అమరావతి సంపద సృష్టించే నగరం. ఈ ప్రభుత్వం వచ్చే సమయానికి లక్ష కోట్ల ఆదాయం వచ్చేది. మనం వచ్చి ఉంటే రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చేది. అభివృద్ధి జరుగుతూ ఉంటే ఆదాయం వస్తుంది. 63 శాతం ఆదాయం పట్టణ ప్రాంతం నుంచి వస్తుంది.డబ్బులు పెట్టాల్సి వస్తుందని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బోగస్ కమిటీలు వేశారు.


 


విశాఖను ఎంతో అభివృద్ధి చేశాం.విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు శ్రీకారం చుట్టాం. విశాఖకు డేటా సెంటర్ వచ్చి ఉంటే ఇంకా అభివృద్ధి అయి ఉండేది. అన్ని వచ్చి ఉంటే విశాఖ దేశానికి తలమానికంగా తయారయ్యేది. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరిగేవి. మెట్రోను కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు.ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పెండింగ్ లో పెట్టారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి ఉంటే విశాఖకు తాగునీరు వచ్చేది.జీఎన్ రావు కమిటీ దారుణంగా రిపోర్టు ఇచ్చింది.ఎవరికీ అవగాహన లేదు.. ఇష్టానుసారంగా రిపోర్టు ఇచ్చారు. వీటిపై జాతీయ మీడియా కూడా కథనాలు రాసింది.అసెంబ్లీలో ఏకపక్షంగా బిల్లులు పాస్ చేస్తున్నారు. సీఆర్డీఏ బిల్లు మండలికి వచ్చినప్పుడు వైసీపీ సభ్యులు దుర్మార్గంగా ప్రవర్తించారు. 22 మంది మంత్రులతో..టీడీపీ నేతలు ఢీ అంటే ఢీ అన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టాలని చూశారు. చైర్మన్ నీతి నిజాయితీగా వ్యవహరించారు.విశాఖలో ల్యాండ్ పూలింగ్‌లో 6,111 ఎకరాలు తీసుకుంటామన్నారు. మాజీ సైనికులకు ఇచ్చిన భూములు తీసుకోవాలని చూస్తున్నారు. విశాఖలో వైసీపీ నేతలు 32వేల ఎకరాలు ఇప్పటికే కొన్నారు. వాల్తేరు, మధురవాడ, ఆనందపురం, రుషికొండ వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లింది. వైసీపీ భూకబ్జాలను ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ బయటపెట్టింది.


 


భూమినిచ్చి త్యాగం చేసి అశువులు బాసిన రైతుల మృతులకు తెదేపా సంతాపం.రాజధానికి అడగగానే 33వేల ఎకరాల భూములు ఉదారంగా అందజేసి, ఆంధ్రుల చారిత్రక, సాంస్కృతిక వారసత్వ రాజధానిగా అమరావతి నిర్మాణానికి అద్భుత సహకారం అందించి, మన ల్యాండ్‌ పూలింగ్‌ ప్రపంచంలోనే ఒక గొప్ప నమూనాగా పేరొందేలా చేశారు. 29 గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు కట్టుబట్టలతో నడిరోడ్డుపైకి నెట్టబడ్డ రాష్ట్రం నిలదొక్కుకోవడంలో ప్రధాన భూమిక, రాజధానికి భూములిచ్చిన రైతన్నదే.. అలాంటిది గత 9 నెల వైసిపి పాలనలో అనేక అనుమానాలు, దుష్ప్రచారాలు, అక్రమ కేసు, శారీరక హింస, అవమానాల భారంతో, మనోవేదనతో రైతు, మహిళలు, రైతు కూలీలు 41 మంది మృతి చెందడం కలచివేస్తోంది. 


కళ్లముందే తమ బిడ్డలపై తప్పుడు కేసులు పెట్టడం, జైళ్లకు పంపడం, ఆడబిడ్డను పోలీస్‌ స్టేషన్లలో అక్రమంగా అర్ధరాత్రి దాకా నిర్బంధించడం, అటు భూములు కోల్పోయి, ఇటు భవిష్యత్తు అగమ్యగోచరమై ఆవేదనతో అనేక గుండెలు అవిశాయి, ఆగిపోయాయి. వైసిపి ప్రభుత్వ దమనకాండతో భయాందోళనలకు లోనై అసువులు బాసిన రైతులు, మహిళలు, రైతు కూలీలకు ఈ సదస్సు నివాళులు అర్పిస్తోంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తోంది. ఆయా కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది. 


ఈ విపత్కర సమయంలో వారందరికీ అండగా ఉండాలని, అమరావతి వాసులకు సంఫీుభావంగా నిలబడుతున్న 13 జిల్లాల అశేష ప్రజానీకాన్ని ఈ సమావేశం అభినందిస్తున్నది.జెఏసి తరఫున మిగిలిన ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు చేస్తున్న అమరావతి పరిరక్షణ పోరాటంలో తెలుగుదేశం పార్టీ తనవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నది. వన్‌ స్టేట్‌ -వన్‌ కేపిటల్‌, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌- సేవ్‌ అమరావతి సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తామని ఈ సమావేశం  ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదిస్తున్నది.*






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com