జనవరి 27న ఏపీ కేబినేట్ సమావేశం

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 24, 2020, 07:13 PM
 

జనవరి 27న ఏపీ కేబినేట్ భేటి సమావేశం కానుంది. సోమవారం ఉదయం 9.30 నిమిషాలకు మంత్రి మండలి భేటిలో శాసనమండలి రద్దు పై చర్చించనున్నట్టు తెలుస్తోంది. కేబినేట్ సమావేశంలో చర్చించి మండలిని ఉంచాలా రద్దు చేయాలా అనే దాని పై నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. శాసనమండలి రద్దుకు అధికారం పక్షం మొగ్గు చూపుతున్నప్పటికి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు చర్చ జరుగుతోంది.