నిర్ణయం సరైనదైతే న్యాయవాది అవసరమా: వర్ల

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 24, 2020, 06:53 PM
 

ముఖ్యమంత్రి జగన్ ప్రతిదానికి ఉలిక్కి పడుతున్నారని.. మూడు రాజధానులపై ప్రజలు వేసిన కేసులో ప్రభుత్వం తరఫున వాదించేందుకు న్యాయవాదికి రూ.5 కోట్లు ఫీజుగా ఇవ్వడమే అందుకు నిదర్శనమని.. టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. తాను తీసుకున్న నిర్ణయం సరైనదైతే అంత డబ్బు ఇచ్చి న్యాయవాదిని పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలంతా అమరావతి కోసం పోరాడుతున్నారన్నారు. ప్రజలు వేసిన కేసుపై వాదించడానికి ప్రజల డబ్బు ఖర్చుపెడుతున్నారని విమర్శించారు.