జగన్ కు చంద్రబాబు చేతులెత్తి నమస్కరిస్తుంటే మౌనంగా భరించాం : వర్ల రామయ్య

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 21, 2020, 08:47 PM
 

ఏపీ రాజధాని విషయంలో పెద్దన్న పాత్ర పోషించాలని తాము కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కోరితే, టీడీపీ వాళ్లు దద్దమ్మలా? అంటూ జీవీఎల్ వ్యాఖ్యానిస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. తమను తిట్టినా ఫర్వాలేదు కానీ ముందు రాజధాని మార్పును ఆపండి అంటూ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి అరాచక నిర్ణయాన్ని నిలువరించాలని కోరారు. రాత్రి రెండు చేతులెత్తి చిన్నవాడైన జగన్ కు చంద్రబాబు నమస్కరిస్తుంటే మౌనంగా భరించామని వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
నేటి పంచాంగం నేటి పంచాంగం

Wed, Feb 26, 2020, 03:27 PM