కూల్చేయడానికి సినిమా సెట్టింగ్ కాదు : జోగి రమేష్

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 21, 2020, 08:31 PM
 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని పవన్‌ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. కూల్చేయడానికి, పీకేయడానికి ఇది సినిమా సెట్టింగ్‌ కాదని పవన్‌ తెలుసుకోవాలన్నారు. అసెంబ్లీలో జోగి రమేష్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీని కూల్చేస్తామని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో నిర్బంధిస్తామని అన్న కాంగ్రెస్‌, టీడీపీలు కాలగర్భంలో కలిసిపోయాయని అన్నారు. ఢిల్లీ కోటనే ఢీకొన్న నేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం వైఎస్‌ జగన్‌ వెంట ఉన్నారని చెప్పారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ కూడా సీఎం జగన్‌ నిర్ణయానికి మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. అమ్మ ఒడి పథకం పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని రమేష్‌ అన్నారు ఒక మంచి ఆలోచనతో మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారని.. ఆయన నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు.