లోకేష్ గతం మరిచి మాట్లాడుతున్నారు : వైసిపి నేత వీరభద్రరావు

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 21, 2020, 07:50 PM
 

ఏపీ శాసనమండలిని రద్దు చేసే అధికారం ఎవరిచ్చారని లోకేశ్ ప్రశ్నిస్తున్నాడని, అతడి తండ్రి, తాత గతంలో మండలిని రద్దు చేసినవారేనన్న విషయం లోకేశ్ గుర్తుచేసుకోవాలని వైసీపీ నేత దాడి వీరభద్రరావు హితవు పలికారు. శాసనమండలిని రద్దు చేసే అధికారం రాజ్యాంగంలో ఉందని స్పష్టం చేశారు. మండలి రద్దుకు రెండేళ్ల వరకు సమయం పడుతుందని టీడీపీ నేతలు అంటున్నారని, కానీ గతంలో రాజీవ్ గాంధీ 31 రోజుల్లో మండలిని రద్దు చేశారని వెల్లడించారు. 1985లో ఏప్రిల్ 30న రద్దు తీర్మానం చేయగా, అప్పటి ప్రధాని హోదాలో రాజీవ్ జూన్ 1 కల్లా ఆమోదించారని దాడి వీరభద్రరావు వివరించారు. ఇప్పటికీ దేశంలో చాలా రాష్ట్రాల్లో మండలి లేదన్న విషయం గమనించాలని సూచించారు.