ఏపీ శాసన మండలిలో మూడు రాజధానులు రగడ

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 21, 2020, 05:16 PM
 

ఏపీ శాసన మండలిలో మూడు రాజధానులు రగడ జరుగుతుంది. రూల్ 71పై చర్చకు మండలి చైర్మన్ అనుమతించడంతో వైసిపి సభ్యుల అభ్యంతరం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రూల్ 71 పై చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. బిల్లులపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది.  పోడియం వద్దకు ఇరుపక్షాలు చేరారు. కావాలంటే బిల్లులను తిరస్కరించాలని బొత్స సత్యనారాయణ అన్నారు. బిల్లులను అడ్డుకోవడం సరికాదని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్ 71 పై  వైసీపీ సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.