రాజధాని ప్రకటన తర్వాతే భూములు కొన్నాం: పయ్యావుల

  Written by : Suryaa Desk Updated: Mon, Jan 20, 2020, 07:48 PM
 

రాజధాని ప్రకటన తర్వాతే భూములు కొన్నామని టీడీపీ సభ్యులు పయ్యావుల కేశవ్‌ అన్నారు. రాజధానిపై శాసనసభలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ సభ్యులకు కొంత సహనం ఉండాలన్నారు. రాజధానిపై 1-9-2014న కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు. రాజధానిపై 4-9-2014న అసెంబ్లిdలో చర్చ జరిగిందన్నారు. రాజధాని ప్రకటన వెలువడిన 40 రోజుల తర్వాత తాను భూమి కొన్నానని వివరించారు. మోడీ వచ్చాక బినామీల చట్టం తీసుకొచ్చారన్నారు. బినామీల చిట్టాను కేంద్రానికి పంపండి.. ఆ ఆస్తులన్నింటినీ జప్తు చేయించండని పయ్యావుల పేర్కొన్నారు.