బీసీజీ కమిటీపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ నేత వర్ల రామయ్య

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 19, 2020, 08:07 PM
 

రాష్ట్రంలో కొన్నిరోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు బీసీజీ కమిటీ. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రాష్ట్ర రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి తదితర అంశాలపై ఇటీవల అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే ఈ నివేదికలో, మద్రాస్ ఐఐటీ అమరావతిపై అధ్యయనం చేపట్టిందని తప్పుడు సమాచారం ఇచ్చారంటూ టీడీపీ మండిపడుతోంది. అమరావతిపై తామెలాంటి అధ్యయనం చేయలేదని మద్రాస్ ఐఐటీ తేల్చిచెప్పడంతో బీసీజీ కమిటీ విశ్వసనీయతను టీడీపీ గట్టిగా ప్రశ్నిస్తోంది. తాజాగా బీసీజీ కమిటీపై టీడీపీ నేత వర్ల రామయ్య మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీసీజీ కమిటీ నివేదికలో మద్రాస్ ఐఐటీ పేరిట తప్పుడు సమాచారం ఇచ్చారని, తగిన చర్యలు తీసుకోవాలని వర్ల తన ఫిర్యాదులో కోరారు.