ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన వాట్సాప్

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 19, 2020, 07:46 PM
 

ప్రస్తుతం ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లోనూ వాట్సాప్ ఉంటుంది. ఇది ఎంతలా అంటే మనిషి జీవితంలో భాగంగా మారిపోయింది. దూరం బంధాలను దగ్గర చేస్తూ ప్రపంచంలో ఏ మూల నున్నవారితోనైన మాట్లాడుకోవడం.. మెసేజ్ లు పంపుకోవడం వంటివి వాట్సాప్ లో చాలా సులభంగా చేయొచ్చు. అలాంటిది ఇప్పుడు ఈ వాట్సాప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సాయంత్రం 4 గంటల నుంచి సరిగ్గా పనిచేయలేదు. వాట్సాప్ లో ఎవరికి ఫోటోలు, వీడియోలు షేర్ చేసినా సెండ్ కాకపోవడంతో యూజర్లు ఆందోళన చెందారు. దీనిపై వాట్సాప్ సంస్థ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించింది. 7.20 నిమిషాల నుండి మళ్లీ వాట్సాప్ పనిచేస్తోంది.