చింతమనేని గృహనిర్బంధానికి రంగం సిద్ధం.. కానీ..

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 19, 2020, 07:19 PM
 

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గృహనిర్బంధానికి పోలీసులు ప్రయత్నించడం కలకలం రేపుతోంది. రేపు అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పోలీసులు చింతమనేని గృహనిర్బంధానికి రంగం సిద్ధం చేశారు. చింతమనేని నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. అయితే, చింతమనేని పోలీసుల కళ్లుగప్పి తన నివాసం నుంచి అదృశ్యమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది.