టీడీపీ నేతలకు నోటీసులు

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 19, 2020, 07:15 PM
 

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళన చేస్తున్న అమరావతి రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో నోటీసుల జారీపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వచ్చి తమ ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారని టీడీపీ నేత అచ్చాన్నాయుడు తెలిపారు. పోలీసులు తనను నిరంతరం అనుసరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్లే సభ్యులకు నోటీసులు ఇవ్వాలని ఏ చట్టం చెబుతోంది..? అని నిలదీశారు.