రాజధాని మార్పునకు ఒప్పుకోం : యనమల

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 19, 2020, 07:06 PM
 

అభివృద్ధి వికేంద్రీకరణకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే ఏపీ రాజధాని మార్పునకు మాత్రం ఒప్పుకోబోమని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగా అమరావతిలో ఆయన మాట్లాడుతూ…  సీఆర్‌డీఏ ఆర్థిక బిల్లుగా వస్తుండడం సరికాదని ఆయన విమర్శించారు. ఇది ఆర్థిక బిల్లు కిందకు రాదన్నారు. సీఆర్‌డీఏ అనేది ప్రత్యేక చట్టమని యనమల రామకృష్ణుడు చెప్పారు.
నేటి పంచాంగం నేటి పంచాంగం

Wed, Feb 26, 2020, 03:27 PM