ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిసెంబర్ 26 న 13 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2019, 07:15 PM

 తిరుమల శ్రీవారి ఆలయాన్ని డిసెంబర్ 26 సూర్యగ్రహణం సందర్భంగా  ఆలయ అర్చకులు మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని 13 గంటల పాటు మూసివేయనున్నామని.. టీటీడీ తెలిపింది. డిసెంబర్ 25 రాత్రి 11 గంటల నుంచి 26 రాత్రి మ.12గంటల వరకూ ఆలయాన్ని మూసివేసి ఉంటుందని తెలిపింది.
గ్రహణం సందర్బంగా శ్రీవారి ఆలయంతో పాటు వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని కూడా మూసివేస్తున్నట్లుగా టీటీడీ తెలిపింది. 26 జరిగే పలు ఆర్జిత సేవల్ని  కూడా రద్దు చేస్తున్నామని టీటీడీ తెలిపింది. గ్రహణం అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత  తిరిగి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. కాబట్టి భక్తులు గమనించాల్సిందిగా టీటీడీ పాలక మండలి విజ్నప్తి చేసింది. ఈ సూర్య గ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. "ధనస్సు" రాశి మూల నక్షత్రం "మకర , కుంభ" లగ్నాలలో కేతు గ్రస్త కంకణ సూర్య గ్రహణం సంభవిస్తోంది. ఈ గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలలో కనబడుతుంది.
ఖగోళంలో ఈ గ్రహణం 3 గంటల 39 సెకండ్లు ఉంటుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాలలో కంకణోక్త సంపూర్ణ సూర్య గ్రహణం వేర్వేరు సమయాలలో ఉంటుంది. పై మూడు రాష్టాలు మినహాయించి మిగిలిన తెలంగాణ ,ఆంద్రప్రదేశ్ తో పాటు భారతదేశంలోని ఇతర రాష్టాలన్నింటిలో పాక్షిక సూర్యగ్రహణం గోచరిస్తుంది.
హైదరాబాదులో ఉదయం 8:08 నిముషాలకు సూర్యగ్రహణ స్పర్శ ప్రారంభమై మధ్యకాలం 9:30 చేరుకుంటుంది. ఉదయం 11 :10 నిమిషాలకు " పుణ్యకాలం " ముగుస్తుంది. గ్రహణ సమయంలో సూర్యుడు అగ్నివలయంలాగా గ్రహణం చుట్టూ కనపడతాడు. కేరళలోని చెరువుత్తూర్ లో దేశంలో అన్ని ప్రాంతాల్లో కంటే సూర్య గ్రహహణ దృశ్యం సుందరంగా కనపడబోతోంది. ప్రపంచంలో అతికొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఇంత స్పష్టంగా సూర్యగ్రహణం కనిపిస్తుంది. సూర్యగ్రహణం చూసే సమయంలో రక్షిత కంటి అద్దాలు లేకుండా డైరెక్టుగా సూర్యుడిని చూడవద్దని నేత్రవైద్యులు హెచ్చరిస్తున్నారు.
సూర్యుడికి , భూమికి మధ్య చంద్రుడు ప్రవేశించడంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాది సూర్యగ్రహణం, చంద్రుడు సూర్యుడికి మధ్యలో నుండి అంచులో అగ్నివలయంలాగా కనిపిస్తాడు. భారతదేశంలోనే కాకుండా , సౌదీ అరేబియా, సుమత్రా, బార్నియో లాంటి ప్రాంతాల్లో కూడా సూర్య గ్రహణం దర్శనమిస్తుంది. ఎవరైన గ్రహణాన్ని గ్రహణ సమయంలో ప్రత్యక్షంగా చూడకూడదు . గర్భవతులు ఎలాంటి భయందోళనలు చెందనవసరం లేదు. గ్రహణ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ధ్యానం, జపం, ఆధ్యాత్మిక చింతనతో ఉంటే చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com