త్వరలో పందుల పెంపకంపై పాలసీ : తలసాని

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 16, 2019, 05:54 PM
 

త్వరలో పందుల పెంపకంపై మెరుగైన పాలసీ రూపొందిస్తామని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.ఇవాళ పిగ్‌ బ్రీడింగ్‌ పాలసీ పై పందుల పెంపకం దారుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఈ వృత్తిపట్ల ఆసక్తి కనబరిచే వారికి ప్రభుత్వం అన్ని విధానాల చూయూతనిస్తుందన్నారు. రాష్ట్రంలో వేలాది కుటుంబాలు పందుల పెంపకం పై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ వృత్తిని పట్టించుకోలేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ వృత్తిపై ఆధారపడిన వారికి అవసరమైన సహకారం అందిస్తుందన్నారు. పందుల పెంపకం కోసం సొంత భూములు కలిగి ఉన్నవారికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు.