అత్యాచార బాలికను పరామర్శించిన చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 16, 2019, 05:53 PM
 

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గుంటూరులో బాలికపై అత్యాచారం ఘటనను ఖండించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చట్టాలు చేయడం మాత్రమే కాదని, వాటిని అమలు చేయడంలోనూ చిత్తశుద్ధి ఉండాలని అన్నారు. బాలికపై అత్యాచారం జరిగితే సీఎం జగన్ ఇంతవరకు పరామర్శించకపోవడం ఏంటని ప్రశ్నించారు. చివరికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా రాలేదని ఆరోపించారు. గుంటూరులో అత్యాచారానికి గురైన బాలికను పరామర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన చంద్రబాబు బాలిక కుటుంబసభ్యులతో మాట్లాడారు. బాధితురాలికి రూ.50 వేల ఆర్థికసాయం అందిస్తామని వెల్లడించారు. నిందితుడు లక్ష్మారెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శిక్షలు కఠినంగా ఉన్నప్పుడే మిగిలినవారు భయపడతారని తెలిపారు. దిశ చట్టం తెచ్చామని ప్రచారం చేసుకోవడంతో సరిపోయిందని, అమలు కోసం సీఎం ఏంచేశారని నిలదీశారు.