చిత్తూరు కలెక్టర్ ఆఫీసు వద్ద వైసీపీ కార్యకర్త నిరసన

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 16, 2019, 05:01 PM
 

కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ కార్యకర్త తవనంపల్లి మండలానికి చెందిన పట్నం రాజమాణిక్యం వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశాడు. మెడలో చెప్పుల దండ ధరించి నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తవనంపల్లి మండలం వైసీపీ మండల కన్వీనర్ ప్రతాప్ రెడ్డి తనను టార్గెట్ చేస్తూ తనపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగినట్లు చెప్పాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి తాను వైసీపీ వీరాభిమానిగా పార్టీకి ఎనలేని సేవ చేస్తున్నానన్నాడు. పార్టీ కోసం సర్వస్వం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాంటి తనకు కనీసం రేషన్‌కార్డు, ఇతర సౌకర్యాలు అందలేదన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మండల వైసీపీ కన్వీనర్ ప్రతాపరెడ్డి తనపై కక్ష కట్టి.. తనను టార్గెట్ చేస్తూ.. తనపై హత్యాయత్నం చేస్తున్నారని రాజమాణిక్యం ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగినట్లు చెప్పాడు.