తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ జాబితాలో కోహ్లి తన నెంబర్1 ర్యాంక్ ను నిలబెట్టుకున్నాడు. పాకిస్థాన్ తో సిరీస్ తరువాత ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో కూడా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ స్మిత్ విఫలం అవుతుండడం తో అతను రెండో స్థానం తోనే సరిపెట్టుకున్నాడు. కాగా కోహ్లి, స్మిత్ కు మధ్య 17పాయింట్ల వ్యత్యాసం వుంది. ఇక యాషెస్ సిరీస్ దగ్గర నుండి వరుస సెంచరీలతో అదరగొడుతున్న ఆసీస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లబుషెన్ టెస్టు ర్యాంకింగ్స్ జాబితాలో 5వ ర్యాంక్ కు చేరుకొని అదుర్స్ అనిపించాడు. అలాగే పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్ మెన్ బాబర్ అజామ్ కూడా వరుస సెంచరీలతో అదరగొడుతూ మొదటి సారి టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం 9వ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు.