విశాఖపట్నం చేరుకున్న భారత్ – విండీస్‌ జట్లు

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 16, 2019, 04:38 PM
 

భారత్ – వెస్టిండీస్ జట్ల క్రికెటర్లు విశాఖపట్నం చేరుకున్నారు. చెన్నై నుంచి ఇండిగో విమానం ద్వారా విశాఖ విమానాశ్రయంలో అడుగిడిన టీమిండియా, వెస్టిండీస్ క్రికెటర్లకు ఘనస్వాగతం లభించింది. ఈ నెల 18న ఏసీఏవీడీసీఏవైఎస్సార్‌ క్రికెట్ స్టేడియంలో జరగనున్న డే అండ్‌ నైట్ క్రికెట్ మ్యాచ్‌లో తలపడేందుకుగాను ఇరుజట్లు కాసేపటిక్రితం విశాఖకు చేరుకున్నాయి. విమానాశ్రయం నుంచి భారీ భద్రత నడుమ రోడ్డు మార్గాన నోవాటెల్‌ హోటల్‌కు ఆటగాళ్లు బయల్దేరి వెళ్లారు.