సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇంటర్ విద్యార్ధులు ర్యాలీ..

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 16, 2019, 03:19 PM
 

కోరుకొండ శ్రీరాజబాబు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్ధుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం పిడిఎస్ యు ఆధ్వర్యంలో విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. కళాశాల ఆవరణలో తాగునీటి సమస్య పరిష్కరించాలని, శానిటేషన్ చర్యలు చేపట్టాలని, కొత్తగా బాత్ రూం నిర్మాణం చేయాలని, ప్రహరీ, సైకిల్ స్టాండ్ నిర్మించాలని, మౌళిక సదుపాయాలు కల్పించాలని విద్యార్ధులు డిమాండ్ చేసారు. అనంతరం మండల పరిషత్ వద్ధ ఎంపిడివో మూర్తికి వినతిపత్రం అందజేసారు. ఈకార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా ప్రధానకార్యదర్శి కిరణ్ కుమార్ , జిల్లా నాయకులు కె భానుప్రసాద్ , చంద్రశేఖర్ ,గౌతమి, దివ్య, శాంతిస్వరూప్ తదితరులు పాల్గొన్నారు.