ప.గో: విద్యార్థినిపై మాష్టారు లైంగిక వేధింపులు

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 16, 2019, 02:36 PM
 

పాఠాలు చెప్పాల్సిన బడిపంతులు కామాంధుడిగా మారి ఓ విద్యార్థిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమళ్ళ జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఈఘటన వెలుగు చూసింది. 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే స్కూల్లో తెలుగు మాష్టారుగా పనిచేస్తున్న కొయ్య లక్ష్మణ్ రావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక బంధువులు, గ్రామస్తులు హైస్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.