వైసీపీ చెప్పిన సమాధానాలన్నీ తప్పుల తడకలే :యనమల

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 15, 2019, 02:22 PM
 

దిశ బిల్లు వచ్చిన తర్వాత కూడా ఏపీలో అత్యాచారాలు జరగడం సిగ్గుచేటని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిందితులపై చర్యల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఐదు రోజుల శాసన సభా సమావేశాలు జరిగిన తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. ఈ సమావేశాలు సీఎం జగన్ అహంభావానికి నిలువెత్తు నిదర్శనమని, తాము అడిగిన ప్రశ్నలకు వైసీపీ చెప్పిన సమాధానాలన్నీ తప్పుల తడకలేనని మండిపడ్డారు.