చిరంజీవితో ఉన్న విభేదాలపై స్పందించిన పవన్

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 15, 2019, 02:06 PM
 

మెగాసార్ట్ చిరంజీవితో ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని విభేదాలు వచ్చాయంటూ గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఎవరికి తోచినట్లు వారు ఇలాంటి వార్తలు రాస్తుంటారని పవన్ వ్యాఖ్యానించారు. అయితే, సమయం వచ్చినప్పుడు ఇటువంటి అతస్య ప్రచారం వాటికదే మాయపోతుందని వ్యాఖ్యానించారు. ఇటువంటి రాతలకు ప్రాధాన్యం ఎందుకివ్వాలని, వాటిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తమ మధ్య భిన్నమైన అభిప్రాయాలుంటే తాము బయటకు చెబుతామని వ్యాఖ్యానించారు.