ట్రెండింగ్
Epaper    English    தமிழ்

18 ఏళ్ల యువతి పై అత్యాచారం..

national |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2019, 02:03 PM

ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిని నిందితులు సజీవ దహనం చేసిన ఘటన మరవకముందే అలాంటి దారుణం శనివారం యూపీలోని ఫతేపూర్‌ జిల్లాలో జరిగింది. ఫతేపూర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు దూరపు బంధువు ఒకరు ఆమెను రేప్‌ చేసి, ఆమెకు నిప్పంటించాడు. బాధితురాలి ఆక్రందనలు విన్న చుట్టుపక్కల వారు ఆమెను దగ్గరలోని ఓ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. బాధితురాలు కాన్పూర్‌లోని ఓ ఆస్పత్రిలో 90% కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com