పల్సర్ బైక్‌ను తగలబెట్టిన దుండగులు

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 15, 2019, 01:17 PM
 

శ్రీ‌కాకుళం జిల్లా సంత‌బొమ్మాలి మరువాడ పంచాయతీ డి.మరువాడ గ్రామానికి చెందిన సూరాడ లక్ష్మణ్ తన ఇంటి ముందు ఉంచిన పల్సర్ బైక్ ను శనివారం అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేసినట్లు బాధితుడు తెలిపారు. దీనిపై సంతబొమ్మాలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.