మూడు చేతులతో జన్మించిన శిశువు

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 15, 2019, 12:41 PM
 

బాపట్లలో మూడు చేతులతో ఓ వింత శిశువు జన్మించింది. ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఈ ఘటన జరుగగా, జన్యుపరమైన లోపాల కారణాలతో ఇలా జరిగిందని వైద్యాధికారులు వెల్లడించారు. ఈ విషయమై ఆసుపత్రి వైద్యురాలు మాట్లాడుతూ, ఈ దంపతులది మేనరిక వివాహమని తెలిపారు. మరిన్ని వివరాలను వెల్లడించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించని కారణంగా, వారి పేర్లను బహిర్గతం చేయలేమని స్పష్టం చేశారు.


ఐదో నెలలో స్కానింగ్ చేసిన సమయంలో ఈ లోపాన్ని గుర్తించలేదని, ఆపై ఎనిమిదో నెలలో గమనించినా, అప్పటికే ఆలస్యం కావడంతో గర్భస్రావం చేయలేకపోయామని అన్నారు. ఆ మహిళకు సాధారణ కాన్పే జరిగిందని, శిశువు ఆరోగ్యం విషమంగా ఉందని, బతికే అవకాశాలు స్వల్పమని అన్నారు. ఇదే దంపతులకు మూడు సంవత్సరాల క్రితం తొలి కాన్పులో కాళ్లు, చేతులు లేకుండా మగబిడ్డ పుట్టి చనిపోయాడని ఆమె తెలిపారు.