మాజీ మంత్రి బండారు కుమారుడు అప్పలనాయుడు కారు బీభత్సం

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 15, 2019, 11:53 AM
 

విశాఖ బీచ్‌రోడ్‌లో మాజీ మంత్రి బండారు కుమారుడు అప్పలనాయుడు కారు బీభత్సం సృష్టించింది. బీచ్‌ రోడ్‌లో మితిమీరిన వేగంతో అప్పలనాయుడు కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కారులో అప్పలనాయుడుతో పాటు రిటైర్డ్‌ డీఐజీ కుమారుడు, మరో ఇద్దరు ఉన్నారు. మౌర్య, ప్రవీణ్‌కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలం నుంచి అప్పలనాయుడు పరారయ్యారు.