వైసిపిలో చేరిన టిడిపి ముఖ్య నాయకులు

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 15, 2019, 11:26 AM
 

పట్టణానికి చెందిన పలువురు టిడిపి ముఖ్య నాయకులు ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే కె.పి కొండారెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల కొరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నూతన చట్టాలు మరియు నవరత్నాల అమలు తీరును చూసి పట్టణంలోని టిడిపి ముఖ్య నాయకులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీలో అందరు సంయమనంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వైసిపి విజయానికి కృషి చేయాలని కోరారు. టిడిపి నుండి వైసిపిలో చేరిన వారిలో మాజీ మున్సిపల్‌ వైయస్‌ చైర్మన్‌ షెక్షావలి, ఆర్యవైశ్య ప్రముఖులు తడికమళ్ల బాలసుబ్బారావు, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్‌. బాదుల్లా, పఠాన్‌ ప్రముఖ వైద్యులు డా. మగ్బుల్‌భాష, సత్తార్‌, మాజీ కౌన్సిలర్లు మయూరిఖాశిం, అమీరుల్లాఖాన్‌లతో పాటు పలువురు టిడిపి నాయకులు కండువాకప్పుకుని వైసిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో వైసిపి యువనాయకులు కుందురు కృష్ణమోహన్‌రెడ్డి, రాష్ట్ర వైసిపి కార్యదర్శి యం.షంషీర్‌ అలీబేగ్‌, మాజీ జడ్‌పిటిసి జవ్వాజి రంగారెడ్డి, మాజీ కౌన్సిలర్లు షేక్‌. ఇస్మాయిల్‌, బుశ్శెట్టి నాగేశ్వరరావు, మండల పార్టీ నాయకుడు నల్లబోతుల కొండయ్య, కొత్త కృష్ణ, గాయం నాగేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.