పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులు

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 15, 2019, 11:19 AM
 

అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని కాకినాడ జిల్లా కలెక్టర్‌ డి.మురళీ ధర్ రెడ్డి అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు 68వర్ధంతి పురస్కరించుకొని కలెక్టర్‌ మురళీధర్ రెడ్డి, కాకినాడ ఎంపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి జాయింట్ కలెక్టర్ లక్ష్మిసా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణం పోయే వరకు కృషి చేసిన పొట్టిశ్రీరాములు చిరస్మరణీయులని, ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయులని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర సాధనకు పొట్టిశ్రీరాములు ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు.  దళితుల ఉద్దరణ, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పాత్ర ఆమోఘమన్నారు. నేటి యువత పొట్టిశ్రీరాములు బాటలో పయనించాలని కోరారు ఈ కార్యక్రమంలో జేసీ2 రాజకుమారి, ఫ్రూటి కుమార్ రత్నాజీ భాష కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.