లిఫ్ట్‌ ఇస్తామంటూ.. మైనర్ బాలికపై అత్యాచారం

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 08, 2019, 01:50 PM
 

చిత్తూరు జిల్లా తిరుచానూరు సమీపంలోని అలివేలు మంగాపురం వద్ద 16 ఏళ్ల మైనర్ బాలిక పై శనివారం మధ్యాహ్నం ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. లిఫ్ట్‌ ఇస్తామంటూ బాలికను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లినట్లు సమాచారం. నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు స్కూటర్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.