తాగునీటి కోసం కన్నీటి గోస.. అధికారులకు తెలిపినా ప్రయోజనం లేదు

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 08, 2019, 01:27 PM
 

చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం కొమర గుంట దళితవాడలో గత పది రోజులుగా తాగునీటికి దళితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు అనేకసార్లు విన్నవించుకున్నా ఏ మాత్రం గ్రామం వైపు కన్నెత్తి చూడలేదు అని దళితులు ఆరోపిస్తున్నారు. ఉన్నా విద్యుత్ మోటరు మరమ్మతులకు గురై నెలలు గడుస్తుంది. సంబంధిత విషయమై అధికారులకు తెలిపినా ప్రయోజనం లేదని గ్రామస్తులు ఆదివారం పాత్రికేయులకు విన్నవించారు. తాగునీరు కావాలంటే పొలాల గట్లపై వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. ఇకనైనా సంబందిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.