కృష్ణ జిల్లా ఉయ్యూరులో రోడ్ ప్రమాదం

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 08, 2019, 10:12 AM
 

కృష్ణ జిల్లా ఉయ్యూరులో రోడ్ ప్రమాదం సంభవించింది. బీఎస్ఆర్ ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వారిని కిరణ్, ప్రదీప్ గా గుర్తించారు. మృతిదేహాలను ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.