ఏసీబి వ‌ల‌కు చిక్కిన రెవిన్యూ సర్వేయర్

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 06, 2019, 12:02 AM
 

విశాఖ జిల్లాలో మ‌రో అవినీతి తిమింగ‌లం ఏసిబి వ‌ల‌కు చిక్కింది. మూడు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా  రెవెన్యూ సర్వేయర్  ని పట్టుకుంది. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌లొకి వెళిత  పద్మనాభం మండలం రెడ్డిపల్లి గ్రామంలో వెంకట్రావ్ అనే రైతులు వ్యవసాయ భూమి వుంది. కొద్దికాలం క్రితం అతడు మరణించడంతో త‌న పేరున మ్యూటేషన్ కోసం వెంకట్రావ్ భార్య మహేశ్వరి దరఖాస్తు చేసుకుంది. ఆ భూమిని సర్వేచేసి నిర్ధారించేందుకు సర్వేయర్ సువ్వరపు జగన్నాథరావ్ ...ఐదు వేలు లంచాన్ని డిమాండ్ చేశాడు. దీంతో త‌ను అంత ఇవ్వ‌లేనంటూ  మూడువేల రూపాయలకు బేరం కుదుర్చుకుని,  బాధితురాలు ఏసీబీని ఆశ్రయించింది. నగదు తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు పట్టుకున్నారు. ప్ర‌స్తుతం స‌ర్వేయ‌ర్ క‌స్ట‌డీలో ఉన్నాడు.