ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డబ్బుకు ఎన్నిపేర్లో తెలుసా?

national |  Suryaa Desk  | Published : Thu, Dec 05, 2019, 08:46 PM

ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది డబ్బు అని చెప్పడంలో పొరపాటేమి లేదు. డబ్బుకు లోకం దాసోహం అని పెద్దలు చాలా ఏళ్ల కిందటనే చెప్పారంటే దీనికి ఎంత పవర్ ఉందో ఆలోచించండి. ఇప్పుడు ఏం కొనాలన్నా డబ్బు కావాల్సిందే. నీళ్లు కూడా కొనుకునే స్థితికి దిగజారిపోయాం. ఇక విద్య, వైద్యం వంటి అత్యవసరమైన వాటికి కూడా డబ్బు కావాల్సిందే. డబ్బు పెడితేనే మెరుగైన వైద్యం. అలాగే ఉన్నతమైన విద్య. ఇలా ప్రతి ఒక్కరికీ డబ్బు అత్యవసరం అయ్యింది .ఇక్కడ మనకు ఒక విషయాన్ని గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. డబ్బుకు ఎన్నో రకాల పేర్లున్నాయి. అంటే ఇక్కడ మీరు అవును.. ఒక్కో దేశంలో డబ్బుకు ఒక్కో పేరు ఉంటుందని కాదా? అని మాత్రం భావించొద్దు. మన దేశంలోనే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వివిధ సందర్భాల్లో డబ్బును పలు రకాల పేర్లతో పిలుస్తారు.
పెళ్లికి సంబంధించిన పెళ్లి కొడుకు వారికి పెళ్లి కూతురు కుటుంబం ఇచ్చే డబ్బును 'కట్నం' అని పిలుస్తారు.
*బ్యాంక్ నుంచి డబ్బును అప్పుగా తీసుకుంటే దీన్ని 'లోన్‌'గా వ్యవహరిస్తాం.
*కంపెనీలు ఉద్యోగులకు పని చేసినందకు ఇచ్చే మొత్తాన్ని 'శాలరీ'గా పిలుస్తాం.
*భార్యాభర్తల విడాకుల విషయానికి వస్తే భర్త భార్యకు చెల్లించే డబ్బును 'భరణ'గా పేర్కొంటారు.
*మీరు ఎవరికైనా డబ్బు తిరిగి ఇవ్వాల్సి ఉంటే దాన్ని 'రుణం'గా పేర్కొంటాం.
*కోర్టులు ఎవరైనా తప్పు చేస్తే, రూల్స్ అతిక్రమిస్తే.. అప్పుడు 'జరిమానా' విధిస్తాయి. జరిమానాను డబ్బుతోనే చెల్లించాలి.
*దేవాలయాలు లేదంటే చర్చ్‌ల విషయానికి.. ఎవరైనా వీటికి డబ్బులు ఇస్తే దీన్ని 'విరాళం'గా భావిస్తారు.
*ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టాలకు కిందకు వచ్చే వారు ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తే దాన్ని 'పన్ను'గా పేర్కొంటాం.
*స్కూళ్లలో పిల్లల చదువుకు చెల్లించే మొత్తాన్ని 'ఫీజు' అని పిలుస్తారు.
ఇంకా అనేక రంగాల్లో నగదును వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com