వంశీ....నీవు ఎన్నికైన రెండు సార్లు జూ.ఎన్టీఆర్ రాలే...

  Written by : Suryaa Desk Updated: Tue, Nov 19, 2019, 12:23 AM
 

150 సీట్లు వస్తే.. రాష్ట్రాన్ని ఏమైనా మీకు రాసిచ్చారా?  వైసీపీ నాయకులు, మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారని టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర  మండి ప‌డ్డారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఈ ఆరు నెల‌ల్లోనే తీసుకున్ననిర్ణ‌యాల‌తో జ‌నం అత‌లాకుత‌ల‌మైపోతుంటే.... రాష్ట్రంలో ప్రజలనుంచి వస్తున్న వ్యతిరేకత, కార్మికుల నుంచి ఎదురవుతున్న తిరుగుబాటును పక్కదారి పట్టించేందు  రాష్ట్ర ప్రభుత్వం స‌రికొత్త‌ డ్రామాలకు తెరతీసిందని ఆయన మండిపడ్డారు. 
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మ‌ల్యే వల్లభనేని వంశీ తో చేయిస్తున్న విమ‌ర్శ‌లు ప‌న్నుతున్న కుయుక్తులు చూస్తుంటే  జూనియర్‌ ఎన్‌టీఆర్‌ గురించి మాట్లాడేందుకు వంశృ డ్రామా యాక్టర్‌గా అవతారమెత్తారని ఎద్దేవా చేశారు. 2009 త‌రువాత ఈ ప‌దేళ్ల‌లో జూ. ఎన్టీఆర్ పార్టీ వేదిక‌ల‌లో పాలు పంచుకోలేద‌ని, మ‌హానాడులో ఒక‌సారి మెరిసి మాయ‌మైన విష‌యం గుర్త‌లులేదా? అని నిల‌దీసారు. 2014, 2019 ఎన్నికలలో జూనియర్‌ ఎన్‌టీఆర్‌ ప్రచారం చేయలేదని.. అయితే ఆ  ఎన్నిక‌ల‌లో వంశీ పార్టీ త‌ర‌పున‌ ఎందుకు పోటీ చేశారో ప్రజలకు చెప్పాలని రవిచంద్ర డిమాండ్‌ చేశారు. తన అవసరాల కోసం వైసీపీ పంచనచేరి టీడీపీని ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రజలు నమ్మె పరిస్థితి లేదని చెప్పారు. సంస్థాగత ఎన్నికలలో పార్టీ పటిష్టత కోసం పనిచేసే వారికే పదవులు దక్కుతాయని బీద స్పష్టం చేశారు.