తొలిరోజే అయ్యప్ప ఆదాయం అద‌ర‌హో...

  Written by : Suryaa Desk Updated: Mon, Nov 18, 2019, 11:51 PM
 

కేరళలోని శబరిమలలోకొలువై ఉన్న అయ్య‌ప్ప ద‌గ్గ‌ర‌కు భ‌క్తులు పోటెత్తుతున్నారు. మండల, మకరవిల ఉత్సవాలు జరగనున్న సందర్భంగా నవంబరు 17 సోమవారం సాయంత్రం శ్రీధర్మశాస్త దేవాలయం తెరచారు. ఈ సంద‌ర్భంగా గ‌త 40 రోజులుగా దీక్ష‌బూనిన భక్తులు పెద్ద సంఖ్యలో త‌ర‌లి వ‌చ్చారు. ఆలయం తెరిచిన తొలిరోజే రూ. 3.30 కోట్లు ఆదాయం సమకూరినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ ప్రెసిడెంట్ ఎన్ వాసు మీడియాకు చెప్పారు.  గత సంవత్సరం తొలిరోజు 2.04 కోట్ల ఆదాయం వచ్చిందని.. ఈ సంవత్సరం రూ. 3.32 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. అంటే దాదాపు 50 శాతం ఆదాయం పెరిగిందని, భక్తుల సంఖ్య కూడా భారీగా పెరిగిన‌ట్టు వివ‌రించారు.