మందుపై అలా బాదేసి దోచేస్తున్నారుగా... సాయిరెడ్డీ

  Written by : Suryaa Desk Updated: Mon, Nov 18, 2019, 08:39 PM
 

అయిన దానికి కాని దానికి ట్విట్ట‌ర్లో చంద్ర‌బాబుపై త‌న‌దైన మార్కు సెటైర్లు వేసే విజయసాయిరెడ్డి పై  టీడీపీ నేత బుద్ధా వెంకన్న త‌న దైన బాణీలో స్పందించారు. తాజాగా మద్యపాన నిషేధం పై చంద్ర‌బాబు దీక్ష చేస్తే, చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. జగన్ అన్న మద్యం దుకాణాల్లో సరుకు చాల కాస్టలీ గురూ అంటూ బ్రాంది బాటిళ్లు మేడలో వేసుకుంటారేమో అన్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేసారు. 


దీనిపై ఘాటుగా స్పందించిన బుద్దా వెంక‌న్న ఇప్ప‌టికే షాపుల్లో సీసా మీద ఎమ్మార్పీ కంటే 30 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్న వారంతా, అధికార పార్టీకి చెందిన వారికి కొంత క‌ప్పం క‌డుతుంటే, రాత్రి 8 దాటిన తరువాత ఇంకో 30 ఎక్కువ బాదేస్తు జ‌నాన్ని దోచుకుంటు  రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు సాయిరెడ్డి గారు? అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ విషయం లో మద్యపాన నిషేధం వివాదం సరి కొత్తగా మొదలైన‌ట్టే క‌నిపిస్తోంది.