సరిగ్గా ౩౦ ఏళ్ల క్రితం…15 నవంబర్ 1989 లో ఓ పదహారేళ్ల పిల్లవాడు..ఇండియన్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రపంచంలో టెస్ట్ క్రికెట్ లు ఆడడం చాలా కష్టమైన రోజుల్లోనే బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగాడు. బ్యాట్స్ మెన్ గా తొలి ఆటలో మొదటి ఇన్నింగ్స్ లో 15 పరుగులు చేశాడు. ఆ తర్వాత తన పవరేంటో చూపిస్తూ చిచ్చర పిడుగులా చెలరేగిపోయాడు.. తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకున్నాడు. క్రికెట్ చరిత్రనే తిరగరాశాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయాడు. అతనే సచిన్ టెండూల్కర్.
నాటి పాకిస్తాన్ క్రికెట్ టీమ్ లో ఉన్న ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్ లాంటి వాళ్ల చేత మెప్పు పొందాడు. సరిగ్గా అదే రోజు పాకిస్తాన్ టీమ్ లోకి వకార్ యూనిస్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. కరాచీలో జరిగిన ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సచిన్ టెండూల్కర్ ను డిస్మిస్ చేసింది వకారే కావడం యాదృచ్ఛికమే. ఆ తర్వాత సచిన్ తన బ్యాటింగ్ సత్తాను చాటాడు. రెండో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 59 పరుగులు చేశాడు. ఫోర్త్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో 57 రన్స్ చేయడంతో సిరీస్ డ్రా గా ముగిసింది. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆగస్ట్ 14, 1990 లో ఇంగ్లాడ్ టూర్ లో ఫస్ట్ టెస్ట్ లోనే వంద రన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్శించాడు.
సచిన్ క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే అదో చరిత్ర…..క్రికెట్ లో గతంలో ఉన్న ప్రతి బ్యాటింగ్ రికార్డ్ ను సచిన్ టెండూల్కర్ బ్రేక్ చేశాడు. కొత్త కెరీర్ ప్రారంభించే వారికి ఆయన ఓ రోల్ మోడల్.