భ‌వ‌న నిర్మాణ కార్మికులు ఎక్క‌డ చ‌నిపోయారండీ...

  Written by : Suryaa Desk Updated: Fri, Nov 15, 2019, 09:52 PM
 

50 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారంటూ విప‌క్షం రాధ్దాంత చేస్తోంద‌ని అధర్మంగా వ్యవహరిస్తూ లోకేష్ చంద్రబాబులు శవరాజకీయాలు చేస్తున్నారని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధి, ఎంఎల్ ఏ అంబటి రాంబాబు నిప్పులు చెరగారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాలో మాట్లాడుతూ . ఎక్కడ చనిపోయారండి భ‌వ‌న నిర్మాణ కార్మికులు ? అని నిల‌దీసారు. వెనకబడిన వర్గాల వారంటే జగన్ కి కక్ష అంటూ ప్ర‌చారం చేసేందుకే ఇసుక సమస్యను తెచ్చారు అని మండి ప‌డ్డారు.  14 ఏళ్లు ముఖ్యమంత్రి, పదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నవ్యక్తి ఇసుక దీక్షలో డ్రామాలు ఆడారు. పలుగు,పారలు కెమెరాలకు కనబడేలా చేయాలని దీక్షలో కూర్చున్నవారికి చంద్రబాబు డైరక్షన్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ను మించిన మహానటుడు చంద్రబాబు అని ఆయన అన్నారు. ఇసుక కొరతపై చంద్రబాబు చేసింది దొంగ దీక్ష అని తెలిపారు. ఆరునెలలు అధికారం లేకపోయేసరికి చంద్రబాబు ప్రస్టేషన్ లో ఉండి ఇప్పుడు త‌న వికృత రూపం ప్రదర్శిస్తున్నారంటూ  విమర్శించారు. బొచ్చా,పార పట్టుకున్నవారినే కాదు పవన్ కల్యాణ్ తో సైతం బాగా నటింపచేస్తున్నారు చంద్రబాబు అని ఆయన అన్నారు.