నేను ఇప్పటికి ఇంగ్లిష్ తో కుస్తీపడుతున్న - పుష్పా ...

  Written by : Suryaa Desk Updated: Fri, Nov 15, 2019, 09:48 PM
 

ఆంధ్రప్రదేశ్‌ ఏపీ డిప్యూటీ సీఎం పుష్పా శ్రీవాణి కీలక వ్యాఖ్యలు చేశారు. బూసరాజుపల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన ‘మన బడి నాడు-నేడు’ కార్యక్రమంలో మాట్లాడుతూ…’ఇంగ్లీష్ రాకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి నేనే ఒక ఉదాహరణ. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివాను. ఇంటర్ ఇంగ్లీష్ మీడియంలో మూడు నెలలు చదివాను. ఆ తర్వాత మళ్లీ తెలుగు మీడియంలో చేరాను. డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పటికీ ఆ భాషపై పట్టు సాధించలేకపోయాను. ఇంగ్లీష్ రాకపోవడంతో ఇప్పుడెంతో ఇబ్బంది పడుతున్నాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి విద్యార్థులకు అలాంటి ఇబ్బంది రాకూడదనే… ఇంగ్లీష్ మీడియంను అమలు చేస్తున్నామని చెప్పారు.