సుప్రీం స్టే ఇవ్వ‌లే...నే శ‌బ‌రిమ‌ల వ‌స్తున్నాన‌ని చెప్పిన తృప్తి

  Written by : Suryaa Desk Updated: Fri, Nov 15, 2019, 09:48 PM
 

త‌న‌కు కేరళ ప్రభుత్వం పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకపోయినా తను ఖ‌చ్చితంగా శబరిమల వచ్చితీరుతానని  మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తి దేశాయ్ తేల్చి చెప్పారు. కేరళ దేవస్వం మంత్రి కె.సురేంద్రన్ అయ్య‌ప్ప ద‌ర్శ‌నానికి మ‌హిళ‌ల రాక‌పై ఇచ్చిన ప్రకటనకు కౌంటర్‌గా ఆమె  శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ  మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకోవచ్చనంటూ సుప్రీం కోర్టు గతంలో  2018 సెప్టెంబరు 28న ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ల విచారణ సందర్భంగా స్టే ఏమీ ఇవ్వలేదన్న విష‌యాన్ని గుర్తు చేసుకోవాల‌ని,  సుప్రీం తీర్పు మేరకు మహిళలకు అయ్యప్పను దర్శించుకునే హక్కు ఉందని, కేరళ మంత్రి సురేంద్రన్ వ్యాఖ్యలు సుప్రీం కోర్టును  అగౌరవపరచేలా ఉన్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు తృప్తి దేశాయ్.  పోలీసు ప్రొటెక్షన్ కావాలంటే కోర్టు ఆర్డర్ తెచ్చుకోవాలంటూ కేర‌ళ ప్ర‌భుత్వ పెద్ద‌లు వ్యాఖ్యానాలు చేయ‌టం తగనిదని అన్నారు తృప్తి దేశాయ్.