ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్యలో 5 ఎకరాలు అవసరం లేదు…

national |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2019, 08:51 PM

సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలో మసీదు నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే ఐదు ఎకరాల భూమిని తీసుకోకూడదని అయోధ్య కేసులో కీలకంగా వ్యవహరించిన జమాతె ఉలేమా-ఎ-హిందూ సంస్థ నిర్ణయించింది. తమ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని…కూల్చిన బాబ్రీ మసీదుకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి భూమిని, డబ్బులను తీసుకోమని ప్రకటించింది. మసీదుకు ప్రపంచంలో ఏది ప్రత్యామ్నాయం కాదని పేర్కొంది. అంతేగాకుండా అయోధ్య స్థల వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే అవకాశాలను తోసిపుచ్చలేదు. ఈ విషయంలో తమ సంస్థ అధ్యక్షుడు అర్షద్ మదానీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల నిజ నిర్ధారణ కమిటీ న్యాయ సలహాలను తీసుకుంటుందని సంస్థ యూపీ చీఫ్‌ మౌలానా అషద్ రషిదీ చెప్పారు. 1919 లో ఏర్పడ్డ జమాతె ఉలేమా-ఎ-హిందూ ముస్లిం లో ప్రభావవంతమైనది సంస్థ. ఆర్ధికంగా కూడా బలమైనది. ఖిలాఫత్ ఉద్యమం, స్వాతంత్రోద్యమంలో ఈ సంస్థ చురుకుగా పాల్గొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com