పోలవరం” పై అభ్యంతరాలు చెప్పే హక్కు తెలంగాణకు లేదు: ఏపీ సర్కార్

  Written by : Suryaa Desk Updated: Fri, Nov 15, 2019, 08:49 PM
 

పోలవరం విషయంలో అభ్యంతరాలు చెప్పే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఏపీ సర్కార్ పేర్కొంది. తెలంగాణలోని ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపేయడంతో అభ్యంతరాలు చెప్పే హక్కు తెలంగాణ కోల్పోయిందని పేర్కొంది. అధే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వొద్దంటూ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఏపీలోని రైతుల ప్రయోజనాలకు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ కేసులో తెలంగాణను పార్టీగా పరిగణించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. విభజన హామీల అమలులో జాప్యం జరుగుతోందంటూ తెలంగాణకు చెందిన బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి ప్రతిగా తెలంగాణ ప్రభుత్వంఅఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడు దీనిపై ఏపీ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.